Jul 18,2021 19:50

తెలుగు బుల్లితెరపై రియాల్టీ షో అంటే బిగ్‌బాస్‌ తర్వాతే ఏదైనా. హిందీ,తమిళ్‌, తెలుగు భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రాచుర్యం పొందిన ఈ రియాల్టీ షోకు విపరీతమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. సెలబ్రిటీలను ఓ ఇంట్లో వంద రోజుల పాటు ఉంచి...టాస్క్‌లు,గేమ్‌లు ఆడించి..ప్రేక్షకులను టివిలకు కట్టిపడేయడంతో టిఆర్‌పి రేటింగ్‌లో కూడా దూసుకెళుతుందనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు గడవగా...దేనికదే ప్రత్యేకం. ఐదవ సీజన్‌ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్వాహకులు సైతం ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అదేవిధంగా ఇప్పటికే ఐదో సీజన్‌ కంటెస్టెంట్‌ వీరంటే..వీరని పలు జాబితాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో లిస్టు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సారి నటి కం యాంకర్‌ వర్షిణి, యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌, యాంకర్‌ రవి, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖా వాణి, బుల్లి తెర సీరియట్‌ నటి నవ్య స్వామి, యాంకర్‌ ప్రత్యూష, సింగర్‌ మంగ్లీ, శేఖర్‌ మాస్టర్‌, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్ధ్‌ వర్మ, విష్ణుప్రియ, లోబో, సింగర్‌ మంగ్లీ పేర్లు వినిపిస్తున్నాయి.