Feb 12,2023 22:07

ఫొటో : శంకుస్థాపన చేస్తున్న దృశ్యం

బిఎస్‌ఆర్‌ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు ప్రాంతంలో 50 సంవత్సరాలుగా వైద్య సేవలు అందించి ప్రజా వైద్యులుగా పేరుగాంచి మూడు పర్యాయాలు శాసనసభ్యునిగా, స్టేట్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సేవలందించి, ఆత్మకూరు పెద్దాయనగా పేరుగాంచి అందరికీ సుపరిచితులైన డాక్టర్‌ బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు బిఎస్‌ఆర్‌ సెంటర్‌లో ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాన్ని బొమ్మిరెడ్డి కుటుంబ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, డాక్టర్లు, లాయర్లు, బి.ఎస్‌.ఆర్‌. అభిమానులు నడుమ ఎంతో కోలాహాలంగా జయప్రదం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, అభిమానులు, డాక్టర్లు, లాయర్లు పాల్గొన్నారు.