- బార్లు మాత్రం 10 వరకు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కరోనా నిబంధనలు అన్ని వ్యాపార వాణిజ్య రంగాలకు అమలు చేస్తున్నప్పటికీ, మద్యం అమ్మకాలపై మాత్రం చూసీచూడనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ అమలు ప్రారంభించినప్పటి నురచి దఫదఫాలుగా సడలింపులు ఇస్తూ వచ్చారు. ముందుగా ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అమలు చేసిన లాక్‌డౌన్‌ను ఆ తరువాత మధ్యాహ్నం రెండు వరకు, ఆ తరువాత సాయంత్రం ఆరు, చివరిగా రాత్రి తొమ్మిది గంటల వరకు సడలించారు. ఆలోగా దుకాణాలను మూసివేయాలని చెప్పిన ప్రభుత్వం ప్రజలు ఇళ్లకు వెళ్లేరదుకుగాను గంట సమయాన్ని బఫర్ టైమ్‌గా నిర్దేశించింది. దీంతో దుకాణాలు తొమ్మిది గంటలకే మూసివేస్తున్నారు కూడా. అయితే బార్లు మాత్రం రాత్రి పది గంటల వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. తమకు అనుమతి ఉందని, అందుకే పది వరకు తెరిచి ఉంచుతున్నామని వారంటున్నారు. అధికారిక ఉత్తర్వులును కాదని, బార్లకు అదనపు సమయాన్ని ఎవరు ఇచ్చారన్నది జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోతోరది. అంతే కాకుండా రాత్రి పది గంటల తరువాత అనేక బార్లు పక్కనే ఉన్న చిన్న చిన్న దుకాణాల్లో మద్యం నిల్వ ఉంచి విక్రయాలు సాగిస్తున్నట్లు కనిపిస్తోరది. ఇప్పటివరకు వీటిపై ఎక్సయిజ్‌శాఖ దృష్టి సారిరచలేదన్న విమర్శలు వస్తున్నాయి.










