డీలర్ భార్యకు ఆర్థికసాయం అందజేస్తున్న ధర్మవరం స్టోర్ డీలర్లు
ధర్మవరం టౌన్ : పట్టణానికి చెందిన స్టోర్ డీలర్, కేతిరెడ్డి అభిమాని దేవరకొండ రమేశ్ గత కొంతకాలంగా ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న స్టోర్ డీలర్ల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పరంధామరెడ్డి, డీలర్లు అజంతకిష్ణ, రంజిత్, బైముతక రమణ, బెస్త వెంకటరమణ, అంగజాల నరేశ్, మోటుమర్ల రమణ, చిన్నూరు ప్రసాద్ అనంతపురంలోని సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీలర్ దేవరకొండ రమేశ్‌ను ఆదివారం పరామర్శించారు. వైద్య చికిత్సల నిమిత్తం రూ.20 వేలు అందజేశారు.










