Feb 14,2023 22:08

అవార్డు గ్రహీతను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి కదిరి అర్బన్‌ : తనకు వచ్చిన భారతీయ సేవారత్న అవార్డుకు కదిరి ప్రజలకు అంకితమిస్తున్నట్లు అవార్డు గ్రహీత, పట్టణానికి చెందిన రిషితా చిన్న పిల్లల ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ సివి. మదన్‌కుమార్‌ తెలిపారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించి,కోవిడ్‌ సమయంలో ఉచిత వైద్యసేవలు, చిన్నపిల్లలకు ఉచితం గుండె ఆపరేషన్లు తదితర పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ సివి మదన్‌ కుమార్‌ గ్లోబల్స్‌ స్కాలర్స్‌ ఫౌండేషన్‌ ద్వారా భారతీయ సేవా రత్న అవార్డు - ఉత్తమ ఆదర్శప్రాయమైన డాక్టర్‌ 2023 పద్మశ్రీ డాక్టర్‌ ముకేష్‌ జీ బాత్రా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మదన్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ అవార్డు రావడానికి సహకరించిన కదిరి ప్రాంత ప్రజలకి, మిత్రులకి శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. కదిరి ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన సేవ అందించాలని ఉద్దేశంతో మార్చి నెల నుంచి వృద్ధులకు శుక్లం, కాంట్రాక్ట్‌ సర్జరీ క్యాంపు ప్రతినెల మూడో ఆదివారం నిర్వహిస్తామన్నారు. ఈసందర్భంగా అవార్డు గ్రహీత మదన్‌ కుమార్‌ను వైసిపి పట్టణ అధ్యక్షులు బాహుద్దీన్‌ తదితరులు మంగళవారం సన్మానించారు.