Feb 19,2023 21:40

డాక్టర్‌ మదన్‌కుమార్‌ను సన్మానిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : కదిరి పట్టణానికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్‌ సివి మదన్‌ కుమార్‌ కు భారత సేవ రత్న పురస్కారం వరించిన నేపథ్యలో ఆయనను యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా యుటిఎఫ్‌ నాయకులు తాహీర్‌వలి, శ్రీనివాసులు మాట్లాడుతూ డాక్టర్‌ సివి మదన్‌ కుమార్‌ కుమార్‌ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ఆనంద్‌, రఫీక్‌, మహబూబ్‌ బాషా, మల్లికార్జున, బ్రహ్మ, ఖాదర్‌బాషా, ఆజంబాషా, భార్గవ, రమేష్‌, కరుణాకర్‌, రమణ, శ్రీరాములు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.