Jan 29,2023 17:58

సిడ్నీ  :   ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నొవాక్‌ జకోవిచ్‌ విజయ ఢంకా మోగించారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పదో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. జకోవిచ్‌  తొలి సెట్‌లోనే స్టెఫానోస్‌ను బ్రేక్‌ చేసి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. రెండవ సెట్‌ స్టెఫానోస్‌ మెగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ జకోవిచ్‌ విజయం సాధించడంతో గేమ్‌ను ట్రైబేకర్‌కు తీసుకువెళ్లాడు. మూడోసెట్‌లో జకోవిచ్‌ 7-6తో  టై బ్రేకర్‌లో స్టెఫానోస్‌ను ఓడించి 10వ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.  మొత్తంగా 6-3, 7-6, 7-6 తేడాతో విజయం సాధించారు. జకోవిచ్‌ తన 22 గ్రాండ్‌ స్లామ్‌లతో నాదల్‌ రికార్డును సమం చేశారు.