మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఒకటి, రెండు వారాల పాటు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెల్బోర్న్ వేదికగా జనవరి 18నుంచి ప్రారంభం కావాల్సిన తొలి గ్రాండ్‌స్లామ్ కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో వాయిదా వేసే అవకాశాలున్నట్లు విక్టోరియా స్పోర్ట్స్ మినిస్టర్ మార్టిన్ పకులా బుధవారం తెలిపారు. టోర్నీ నిర్వహణపై ప్రభుత్వ, టెన్నిస్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, టోర్నీ షెడ్యూల్‌కు సంబంధించి తేదీలను సమాలోచిస్తున్నామన్నారు. బహుశా టోర్నమెంట్‌ను ఒకటి లేదా రెండు వారాల పాటు వాయిదా వేసే అవకాశాలు ఖాయంగా కనబడుతున్నాయన్నారు. ప్రస్తుతం తమ వద్ద ఇదొక్కటే ఆప్షన్ ఉందని మార్టిన్ అన్నారు.










