Feb 20,2023 22:05

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి శైలజ

ప్రజాశక్తి-హిందూపురం : విద్యార్థులు ఆశయ సాధనకు అంకితభావంతో కృషి చేయాలని అదనపు జిల్లా జడ్జి శైలజ సూచించారు. సోమవారం స్థానిక ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాల్లో వేర్వేరుగా జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొన్నారు. విద్యార్థి దశ చాలా కీలకమైందని దూరాలవాట్లకు దూరంగా ఉంటూ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ సంస్కారవంతమైన ఉత్తమ పౌరులుగా ఎదగాలని తెలిపారు. ముఖ్యంగా యువత ప్రేమ, చెడు అలవాట్లు వింత పోకడలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డెన్లు చాంద్‌బాషా, తులసి, న్యాయవాదులు నవేరా, పార్వతి, రవికుమార్‌, ఈశ్వరప్ప, లోక్‌ అదాలత్‌ శారద తదితరులు పాల్గొన్నారు.