Aug 28,2022 22:07

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం
మైలవరం నియోజవర్గంలో గడపగడపకూ మన ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగుతుంది. గత 34 రోజులుగా 11620 కుటుంబాలను మైలవరం నియోజక వర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్‌ కలిశారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల చేకూరిన లబ్ది గురించి ఆయన వివరిస్తున్నారు. ఆదివారం దాములూరు సచివాలయ పరిధిలో జరిగిన గడపగ డపకూ మన ప్రభుత్వం ముగింపు సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హతల ప్రకారం ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారన్నారు. ఆయన ఆకాంక్షల మేరకు గ్రామాల్లో సచివాలయ వాలంటర్‌ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అర్హతలు ఉండి స్థలాలు రాని వారికి ఇళ్ళస్థలాలు ఇస్తామన్నారు. జగనన్న లే అవుట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఒక్క దాములూరు వివిధ సంక్షేమ పధకాల ద్వారా నేరుగా లబ్దిదారులకు రూ.6 కోట్ల 35 లక్షలు చేరాయన్నారు. 2 కోట్ల 55 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జలజీవన్‌మిషన్‌ కింద ఓవర్‌ హెడ్‌ ట్యాంకు శాంక్షన్‌ చేశౄమని, ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మించి ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇస్తామన్నారు. ఎస్సి కాలనీలో రూ.25లక్షలతో కమ్యూనిటీ హలు నిర్మాణానికి, షాదీఖానా నిర్మాణానికి రూ.45లక్షలు అనుమతులు పెట్టినట్లు తెలియజేశారు. కృష్ణానది ఒ డ్డున ఉన్న దేవాలయం ప్రక్కన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు సచి వాలయ సిబ్బంది నాయకులు సమన్వయంతో పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్‌ఆర్‌సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.