Feb 20,2023 22:06

జగనన్న లే అవుట్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, తదితరులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : ఇల్లు లేని అర్హులందరికీ పక్కాగృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. కదిరి పట్టణ పరిధిలోని కుటాగుళ్ల సమీపాన అనంతపురం హైవే రోడ్డు ప్రక్కన గల ప్రభుత్వ భూమిలో జగనన్న కాలనీ ఏర్పాటు కోసం స్థలాన్ని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఎర్రగుంటపల్లి వద్ద, ఆరీవో కార్యాలయం ఎదురుగా, టిడ్కో గృహాల వెనుక భాగంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి అర్హులకు పట్టాలు అందజేశామన్నారు. ఆ తరహాలోని మరో రెండు లేఅవుట్లను ఏర్పాటుచేసి అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి పట్టాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.