ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఆఫ్గనిస్తాన్ దౌత్యవేత్త నజీబ్ అలీఖిల్ కుమార్తె సిల్సిలాను కొందరు గుర్తు తెలియని దుండగులు శుక్ర వారం కొద్ది గంటల పాటు అపహరించి వేధింపులకు గురిచేశారు. అనంతరం విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం శనివారం తెలిపింది. సిల్సిలా అలీఖిల్ ఇంటికి వెళ్తున్న సమయంలో అపహరించిన దుండగులు ఆమెను తీవ్రంగా హింసించారని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వాధికారులు తెలిపారు.










