ప్రజాశక్తి-అమరావతి : ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అంగళ్లు, ఐఆర్.ఆర్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను హై కోర్టు కొట్టివేస్తున్నట్లు తెలిపింది. కాగా, ఎసిబి కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు లంచ్ బ్రేక్ తర్వాత తీర్పు వెల్లడిస్తామని ఎసిబి కోర్టు తెలిపింది. రెండు పిటీ వారెంట్లపై మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది.










