Dec 23,2020 11:57

అన్నవరం (తూర్పు గోదావరి) : రాష్ట్ర రెవెన్యూ జిల్లా ఇంఛార్జి మంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్‌ అన్నవరం స్వామిని బుధవారం దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి అన్నవరం కొండపైన ఉన్న అతిథి గృహంలో మంత్రి బసచేశారు. బుధవారం ఉదయం మంత్రికి అక్కడ ఆలయాధికారులు ఆలయ మర్యాదలను నిర్వహించారు. అనంతరం మంత్రి స్వామిని దర్శించుకున్నారు. పండితులంతా మంత్రికి వేద ఆశీర్వవచనం నిర్వహించి, స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ కె.శ్రీనివాస్‌, పి.ఆర్‌.ఓ కొండలరావు, ఆర్‌.ఐ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.