Mar 19,2023 21:26

అంగన్వాడీల అరెస్టు అప్రజాస్వామికం

రాయచోటి టౌన్‌
అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోస చలో విజయవాడకు వెళ్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి డి. భాగ్యలక్ష్మి, రాయచోటి ప్రాజెక్టు అధ్యక్షురాలు సిద్ధమ్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబిర్‌, కెవిపిఎస్‌ జిల్లా కో-కన్వీనర్‌ డి.సి. వెంకటయ్య పేర్కొన్నారు. ఆదివారం వారు విలేకర్లతో మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణా రాష్ట్రంలో కంటే రూ. వెయ్యి వేతనం అదనంగా పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ మాటే మరిచారని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయారని వాపోయారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు. ప్రభుత్వ ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.