అంగన్‌వాడీల ఆందోళన
నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
ప్రజాశక్తి-విజయనగరంటౌన్
అంగన్వాడీ వ్యవస్థకు నష్టం చేసే నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి, అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన గురువారం జిల్లాలోని కలెక్టరేట్, ఐసిడిఎస్ కార్యాలయాల వద్ద అంగన్‌వాడీలు ధర్నాలు చేపట్టారు.
కలెక్టరేట్ వద్ద జరిగిన అంగన్‌వాడీల ధర్నాను ద్ధేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ మాట్లాడారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసే నూతన విద్యావిధానాన్ని ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూళ్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలు నుంచి పని చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కోవిడ్ సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు రక్షణ చర్యలు కల్పించాలని కోరారు. ధర్నాలో యూనియన్ నాయకులు బి.పైడిరాజు, కె.ప్రభావతి. సుశీల, దుర్గాదేవి, ఎన్.సుశీల, ప్రశాంతి, లలితకుమారి అంగన్‌వాడీల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు గొర్లి వెంకటరమణ, కార్యదర్శి బివి రమణ, బి.లక్ష్మి మాట్లాడారు. ఐసిడిఎస్ కేంద్రాల బలోపేతం చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ కు కనీస వేతనం చెల్లించాలని ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. అనేక నెలలుగా బకాయి ఉన్న సెంటర్ల బిల్లులు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు జె.విజయలక్ష్మి, గౌరీమణీ,ముట్నూరు గౌరీ, అలివేలు,సాయిలత తదితరులు పాల్గొన్నారు.
సాలూరు : స్థానిక అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు గురువారం ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్‌వైనాయుడు ఆధ్వర్యాన అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేసి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షులు బి.రాధ, కార్యదర్శి బి.లక్ష్మీ, సెక్టార్ నాయకులు సత్యసూర్యకళ, వరలక్ష్మి, రమణమ్మ పాల్గొన్నారు. రూరల్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు యూనియన్ కార్య దర్శి ఎ..నారాయణమ్మ, సెక్టార్ నాయకులు పాల్గొన్నారు.
గజపతినగరం : స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి మాట్లాడారు. అంగన్‌వాడీ యూనియన్ నాయకులు జ్యోతి, సెక్టార్ నాయకులు పుష్ప, సుభాషిణి, రమణమ్మ, సన్యాసమ్మ, కె.అపర్ణరాణి తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : భద్రగిరి అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలకు బీమా సౌకర్యం, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జానకి, కస్తూరి, శోభ, సుధ, తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస : స్థానిక సిడిపిఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గాడి అప్పారావు, డేగల అప్పలరాజు మాట్లాడారు. అనంతరం సిడిపిఒ శ్రీదేవికి వినతి అందజేశారు. ధర్నాలో అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులు కె.వెంకట లక్ష్మీ, కె.తులసి, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట : సిడిపిఒ కార్యాలయం వద్ద ధర్నానుద్దేశించి సిఐటియు నాయకులు మద్దిల రమణ మాట్లాడారు. అనంతరం సిడిపిఒ రమాదేవికి వినతి అందజేశారు. కార్యక్రమంలో డి.శ్యామల కుమారి, జయలక్ష్మి, దంతేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కురుపాం రూరల్ : సిడిపిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతరం ఐసిడిఎస్ సూపర్‌వైజర్ వినతి అందించారు. కార్యక్రమంలో యూని యన్ నాయకులు ఉమా, సరోజ తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి రూరల్ : స్థానిక ఐసిడిఎస్ అర్బన్, రూరల్ పాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పి.శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌ఇపి విద్యా విధానం వలన అంగన్వాడీ కేంద్రాలకు, ప్రీ స్కూల్ పిల్లలకు నష్టదాయకమన్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసం హరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు వి.ఇందిర, యూనియన్ నాయకులు జ్యోతి, కామేశ్వరి పాల్గొన్నారు.
సాలూరులో ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు










