పద్మావతిని సన్మానిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న డాక్టర్ కెవి పద్మావతి ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఒంగోలు పాలక మండలి సభ్యురాలుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత నియమిం పబడ్డారు. పద్మావతి ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఈసి మెంబర్‌గా మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రవికుమార్ మాట్లాడుతూ ఇది తమ కళాశాలకు ఎంతో గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు డాక్టర్ పద్మావతిని అభినందించారు.










