Feb 10,2023 22:17

విరాళం అందజేస్తున్న నాయకులు

నంబులపూలకుంట : మండల పరిధిలోని గౌకన పల్లిలో గల సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి సిఇసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి ఆలయ అభివృద్ధికి తనవంతు విరాళం అందజేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన 50వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబా ఫక్రుద్దీన్‌, శివారెడ్డి, రామచంద్రారెడ్డి, మల్లారెడ్డి, నాగేశ్వర్‌ రెడ్డి, రాజారెడ్డి, మాజీ తహశీల్దార్‌ ఎల్‌ రెడ్డి, సుబ్బారెడ్డి, రాజారెడ్డి, లోకేష్‌, రమణారెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, అల్లా బకష్‌, మహమ్మద్‌ అలీ, అంజన్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.