తొలగింపు పనులను పరిశీలిస్తున్న ఛైర్‌పర్సన్
ప్రజాశక్తి హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా చాలామంది రోడ్లను ఆక్రమించుకున్నారని వాటి తొలగింపునకు స్వచ్ఛందంగా సహకరిస్తే పురపాలక సంఘాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె వైస్ చైర్మన్ జబీవుల్లాతో కలిసి పట్టణంలో పలు ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. ధనలక్ష్మి రోడ్డును పరిశీలించి రోడ్డులో నిర్మాణం చేసిన ఆక్రమ కట్టడాలను తొలగింపు చర్యలను చేపట్టారు. అనంతరం దుర్గాబాయి దేశ్ ముఖ్ పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ నాగేంద్ర, పలువురు కౌన్సిలర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










