Aug 18,2022 16:19

ప్రజాశక్తి-వీరులపాడు : జుజ్జూరు గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి పెద్దకాకాని వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరంలో వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు 120 మంది కంటి సమస్య ఉన్నవారు పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు పరిశీలించిన తర్వాత 30 మందిని వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ఉచితంగా శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో చికిత్స చేయుటకు ఎంపిక చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం  ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పెట్టి పేద ప్రజల ఆదుకోవాలని కోరారు. పోరాటంతో పాటు మహిళలు పలు సమస్యతో పడుతున్న ఇబ్బందులు వారి ఉపాధి కావలసిన సౌకర్యాలు మహిళా సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు షేక్ చాంద్ బేగం స్వాతి మున్ని అరుణ తదితరులు వైద్య శిబిరంలో వైయస్సార్ సిపి నాయకులు సాయిబాబు వైస్ ఎంపీపీ షేక్ నాగుల్ మీరా ప్రజాసంఘాల నాయకులు లాల్ మొహమ్మద్ గౌస్ సిపిఎం నాయకులు సుందర్రావు తతలు పాల్గొన్నారు.