ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : శనివారం రైల్వే స్టేషన్ వద్ద షఫీ (54) అనే వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు ఆకులు వీధికి చెందిన వ్యక్తి అని సమాచారం. ప్రమాదవశాత్తు మృతి చెందాడా.!, ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










