Aug 18,2022 15:08

ప్రజాశక్తి-ఎన్టీఆర్ (ఇబ్రహీంపట్నం) : ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద హైదరాబాద్ నేషనల్ హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇరువురు మృతి చెందారు. ప్రమాదానికి గురైన ఇద్దరూ విజయవాడ ప్రయివేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరిదీ ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం అని సమాచారం. మృతులు షేక్ భాషా (16), చిన్నం ప్రశాంత్ (17) గా పోలీసులు గుర్తించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.