Feb 25,2023 22:06

బోర్డర్‌గవాస్కర్‌ ట్రోఫీ 4-0తో గెలుస్తాం
బిసిసిఐ మాజీ అధ్యక్షులు సౌరవ్‌ గంగూలీ

కోల్‌కత్తా: వచ్చే నెలలో జరిగే ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తారని బిసిసిఐ మాజీ అధ్యక్షులు సౌరవ్‌ గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీవీ షో కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీజన్‌-16 ఐపిఎల్‌లో పృథ్వీ షా అందరికంటే ఎక్కువ పరుగులు చేస్తాడని, ఆ తర్వాత రిషబ్‌ పంత్‌, గైక్వాడ్‌ రాణించడం ఖాయమని పేర్కొన్నాడు. అలాగే బౌలర్ల కోటాలో ఉమ్రన్‌ మాలిక్‌ ఆకట్టుకొంటాడని జోస్యం చెప్పాడు. ఈ క్రమంలో శుభ్‌మన్‌ గిల్‌ పేరును ప్రస్తావించగా.. వీరి తర్వాతి స్థానంలో శుభ్‌మన్‌ది అని చెప్పుకొచ్చాడు. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌, ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌లను గంగూలీ పరిగణనలోకి తీసుకోలేదు. 'ఆటతీరు పరంగా సూర్యకుమార్‌ యాదవ్‌ అత్యుత్తమ ఆటగాడని, అతడ్ని యువ క్రికెటర్ల లెక్కలోకి తీసుకోలేమని అన్నాడు. యువ క్రికెటర్లంతా పాతికేళ్లలోపు వారేనని, పృథ్వీ షా, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఎలా ఆడుతున్నారో తాను చూస్తూనే ఉన్నానన్నాడు. యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ కూడా తన జాబితాలో ఉన్నాడని, అతడు ఫిట్‌గా ఉంటే తన పేస్‌తో మ్యాచ్‌పై అభిమానులకు ఆసక్తి ఏర్పడేలా చేస్తాడు' అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఈ షోలోనే పాల్గన్న భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.. యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ గురించి గంగూలీని అడగ్గా.. వెంటనే ఈ జాబితాలోకి అతడి పేరును చేర్చాడు. 'అవును సరిగ్గా ఆ పేరు (శుభ్‌మన్‌ గిల్‌) నా మనసులో మెదిలింది. అతడు నా ఐదో ఆటగాడు. పృథ్వీ షా, రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ బహుశా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండొచ్చు. రుతురాజ్‌ గైక్వాడ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శుభ్‌మాన్‌ గిల్‌ తర్వాతి స్థానాల్లో ఉంటారు' అని గంగూలీ పేర్కొన్నాడు. అలాగే బోర్డర్‌ాగవాస్కర్‌ ట్రోఫీని భారత్‌ 4ా0తో చేజిక్కించుకోవడం ఖాయమని పేర్కొన్నాడు.