- టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే
మహిళల క్రికెట్‌కు సంబంధించి మరో కీలక అంతర్జాతీయ టోర్నీ మొదలుకానుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ టోర్నీ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది.ఇండియా మ్యాచ్‌లు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో ఉండటం విశేషం. ఈ టోర్నీని రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహిస్తోంది ఐసీసీ. మొత్తం 10 జట్లు ఇందులో పాల్గొంటుండగా, వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్-బిలో ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. టీమిండియా ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌తో, ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 18న ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి 20న ఐర్లాండ్‌తో తలపడుతుంది. ఈ గ్రూప్‌లో టీమిండియా టాప్-2లో నిలిస్తే సెమీస్ చేరుతుంది. ఈ టోర్నీకి హర్మన్ ప్రీత్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.సెమీస్‌లో విజయం సాధించిన జట్లు ఫైనల్‌లో పోటీ పడుతాయి. ఫిబ్రవరి 26న న్యూలాండ్స్‌లోని కేప్‌టౌన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
భారత జట్టు : హర్మన్ ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే.










