Apr 25,2023 21:14

అహ్మదాబాద్‌: ఇండియన్‌ మహిళల లీగ్‌(ఐడబ్ల్యుఎల్‌) సీజన్‌-2023 ఈనెల 26నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని ట్రాన్స్‌స్టేడియా, షాహీబాగ్‌ పోలీస్‌ స్టేడియం వేదికల్లో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ప్రతిరోజు నాలుగు మ్యాచ్‌లు చొప్పున జరగనున్నాయి. ఉదయం రెండు, సాయంత్రం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈనెల 26 నుంచి మే 13వరకు లీగ్‌ పోటీలు జరగనున్నాయి. ఐడబ్ల్యుఎల్‌ టైటిల్‌కై మొత్తం 16జట్ల పోటీపడనున్నాయి.