Jul 27,2023 22:03

హైదరాబాద్‌ : అంతర్జాతీయ ఔషద, బయోటెక్నాలజీ కంపెనీ అయిన వోకార్డ్‌ లిమిటెడ్‌ తన వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం కీలక వ్యూహాత్మక చొరవలను తీసుకోనున్నట్లు పేర్కొంది. అమెరికా వ్యాపార పునర్నిర్మాణం, బ్రిటన్‌లో వ్యాక్సిన్‌ తయారీ కోసం సీరంతో వ్యాక్సిన్‌ ఒప్పందం, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నోవెల్‌ యాంటీబయాటిక్స్‌ రీసెర్చ్‌ వంటి అంశాలపై కంపెనీ దష్టి సారించినట్లు వెల్లడించింది. 2023 నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 7 శాతం వృద్థిని నమోదు చేసినట్లు పేర్కొంది. తన అమెరికా కార్యకలాపాల పునర్నిర్మాణంలో, కంపెనీ మోర్టన్‌ గ్రోవ్‌లోని తన ఉత్పత్తి కేంద్రాన్ని మూసేసి, సైట్‌ను కాంట్రాక్ట్‌ తయారీ సంస్థలకు బదిలీ చేయడం ద్వారా ఏడాదికి 12 మిలియన్‌ డాలర్లు ఆదా చేయాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొంది.