లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్, పోలండ్‌కు చెందిన ఇగా స్వైటెక్ శుభారంభం చేసింది. సోమవారం నుంచి ప్రారంభమైన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ తొలిరౌండ్ పోటీలో స్వైటెక్ 6-1, 6-3తో చైనాకు చెందిన జూ-లిన్‌పై సునాయాసంగా గెలిచింది. ఇతర పోటీల్లో అజరెంకా(బెలారస్) 6-4, 5-7, 6-4తో యువాన్(అమెరికా)పై, నదియా పొడొరొస్కోవా(అర్జెంటీనా) 3-6, 7-697-5), 6-4తో మటిన్కోవా(చెక్)పై, పెర్రీ(ఫ్రాన్స్) 6-7(4-7), 6-0, 6-4తో డార్క్(ఇంగ్లండ్)పై నెగ్గి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారురిక పురుషుల సింగిల్స్‌లో 7వ సీడ్, రష్యాకు చెందిన ఆండ్రీ రుబ్లేవ్ శుభారంభం చేశాడు. తొలిరౌండ్‌లో రుబ్లేవ్ 6-3, 7-5, 6-4తో ఆస్ట్రేలియాకు చెందిన మాక్స్ పర్సెల్‌పై వరుససెట్లలో నెగ్గాడు. మరో పోటీలో 14వ సీడ్ మసెట్టి(ఇటలీ) 6-3, 6-1, 7-5తో పెరూకి చెందిన జువాన్‌పై విజయం సాధించాడు.










