Jul 06,2023 20:54
  • వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ రెండోరౌండ్‌ రిజల్ట్స్‌

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌లో 3వ సీడ్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌) ఐదుసెట్ల హోరాహోరీ పోరులో నెగ్గాడు. తొలిరౌండ్‌ పోటీలో సిట్సిపాస్‌ 3-6, 7-6(7-1), 6-2, 6-7(5-7), 7-6(10-8)తో మాజీ యుఎస్‌ ఛాంపియన్‌ డోమినిక్‌ థీమ్‌పై పోరాడి నెగ్గాడు. పురుషుల సింగిల్స్‌ ఇతర పోటీల్లో 17వ సీడ్‌ హుర్కరాజ్‌(పోలండ్‌) 6-4, 6-4, 7-6(7-3)తో ఛోన్‌స్కీ(బ్రిటన్‌)పై గెలిచాడు. మరో పోటీలో 14వ సీడ్‌ మసెట్టి(ఇటలీ) 6-4, 6-3, 6-1తో స్పెయిన్‌కు చెందిన మునర్‌పై గెలిచి మూడోరౌండ్‌లోకి ప్రవేశించాడు. అన్‌సీడెడ్‌ వావ్రింకా 6-3, 4-6, 6-4, 6-2తో 29వ సీడ్‌ ఎట్ఛ్‌వెర్రీపై నెగ్గి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
మహిళల సింగిల్స్‌ ఇతర పోటీల్లో మరో పోటీలో అన్‌సీడెడ్‌ స్విటోలినా(ఉక్రెయిన్‌) 6-1, 1-6, 6-1తో 28వ సీడ్‌, జర్మనీకి చెందిన మెర్టెన్స్‌ను ఓడించి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లింది. 16వ సీడ్‌, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ముఛోవా 4-6, 7-5, 1-6తో నెమ్మియర్‌(జర్మనీ) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ఇక 19వ సీడ్‌ అజరెంకా(రష్యా) 6-3, 6-0తో పొడొరొస్కా(అర్జెంటీనా)పై నెగ్గి మూడోరౌండ్‌లోకి ప్రవేశించింది.