క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మెకాలికి సర్జరీ అవసరమైనట్లు తేలింది. 'ఫీల్డింగ్ చేస్తూ గాయపడడం ఎవరికైనా నిరాశకు గురి చేస్తుంది. అయితే.. ఇప్పుడు నా ఫోకస్ అంతా సర్జరీ మీద, రీహాబిలిటేషన్‌లో ఉండడం మీద మాత్రమే ఉంది. నేను కోలుకునేందుకు కొంత సమయం పట్టనుంది. వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను' అని విలియమ్సన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. తెలిపాడు. చెన్నైతో ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన బంతిని బౌండరీ లైన్‌వద్ద ఆపే ప్రయత్నంలో విలియమ్సన్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. విలియమ్సన్‌కు సర్జరీ చేస్తే మాత్రం అతడు ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్‌లో జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు దూరమైనట్లే. ఇక న్యూజిలాండ్ జట్టు 2019 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది.










