Feb 26,2023 09:52
  • నేడు మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌

కేప్‌టౌన్‌ : మహిళల టి20 ప్రపంచకప్‌ చరమాంకానికి చేరుకుంది. రెండు వారాలకు పైగా సాగిన మెగా టోర్నీలో ఆతిథ్య దక్షిణాఫ్రికా, 5సార్లు టైటిల్‌ విజేత ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరకున్నాయి. ఉత్కంఠభరి తంగా సాగిన సెమీస్‌ పోటీల్లో ఆస్ట్రేలి యా జట్టు ఐదు పరుగుల తేడాతో భారత్‌ను ఓడించగా.. దక్షిణాఫ్రికా జట్టు ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచి ఫైనల్‌కు చేరా యి. దక్షిణాఫ్రికా మహిళలజట్టు టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. దక్షిణాప్రికా యువ బౌలర్లు ఇస్మాయిల్‌, ఖాకా చెలరేగితే ఆస్ట్రేలి యాపై గెలుపు సునాయాసమే. ఇలాగే ఓపెనర్లు వోల్హాడర్ట్‌, బ్రిట్స్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నారు.

  • ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ రేసులో రీచా

ఐసిసి టి20 మహిళల ప్రపంచకప్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌' అవార్డు రేసులో రీచా ఘోష్‌ నిలిచింది. ఐసిసి శనివారం ఐసిసి అవార్డు ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. కీలక ఇన్నింగ్స్‌లతో తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది క్రికెటర్లను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. భారత జట్టు నుంచి వికెట్‌ కీపర్‌ రీచా ఘోష్‌ మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించుకుంది. ఫైనల్‌ చేరిన ఆసీస్‌ జట్టులో నుంచి ముగ్గురు, సఫారీ జట్టు నుంచి ఇద్దరు ఈ లిస్టులో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన మేగ్‌ లానింగ్‌, అలిసా హేలీ, అష్‌ గార్డినర్‌లు ఈ లిస్టులో చోటు సంపాదించారు. ఇంగ్లండ్‌ (నాట్‌ సీవర్‌ బ్రంట్‌, సోఫీ ఎక్లెస్టోన్‌), దక్షిణాఫ్రికా జట్టు (లారా వొల్వార్డ్‌, తజ్మిన్‌ బ్రిస్ట్‌) నుంచి ఇద్దరేసి చొప్పున ఈ జాబితాలో స్థానం పొందారు. వెస్టిండీస్‌ నుంచి హేలీ మథ్యూస్‌ను ఐసీసీ షార్ట్‌ లిస్ట్‌ చేసింది. ఈ తొమ్మిది మందిలో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచేది ఎవరో నేటితో తేలిపోనుంది.