- డబ్ల్యుపిఎల్ ఫైనల్ నేడు..
ముంబయి: బిసిసిఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) చివరి దశకు చేరుకుంది. లీగ్ దశ ముగిసిన అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌కు చేరగా.. ముంబయి-యుపి జట్ల మధ్య 21న జరిగిన ఎలిమినేటర్‌లో ముంబయి జట్టు 72పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్ దశలో ఇరుజట్లు భాగంగా ఇరుజట్లు ఒక్కోసారి తలపడగా.. తొలి మ్యాచ్‌లో ముంబయి 8వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందగా.. రెండోసారి ఢిల్లీ జట్టు 9వికెట్ల తేడాతో ముంబయిని చిత్తుచేసింది. ఈ క్రమంలో టైటిల్ ఏ జట్టు కైవసం చేసుకుంటుందో! ముంబయి ఇండియన్స్‌కు టీమిండియా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఉండగా.. ఢిల్లీ జట్టుకు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ వ్యవహరిస్తున్నారు. ఇరుజట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో ఫైనల్ పోటీపై ఉత్కంఠ నెలకొంది.










