Jun 15,2023 22:01

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్‌ రేపు
లండన్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. గత పదేళ్లలో ఒక్కసారి మినహా.. మిగిలిన నాలుగుసార్లు ఆస్ట్రేలియా జట్టు యాషెస్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్లో నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగే తొలిటెస్ట్‌ 2023 యాషెస్‌ సిరీస్‌ సంగ్రామం ప్రారంభం కానుంది. గత ఐదు సిరీస్‌లలో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌పై మెరుగైన రికార్డును కలిగి ఉంది. మూడుసార్లు గెలిచి ఒకసారి సిరీస్‌ను డ్రా చేసుకొని, ఒక్కసారి మాత్రమే ఈ సిరీస్‌ను చేజార్చుకుంది. ఇక ఆస్ట్రేలియా ఓపెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇదే తన చివరి యాషెస్‌ సిరీస్‌ అని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టీవ్‌ స్మిత్‌, వార్నర్‌, లబూషేన్‌, హెడ్‌లతో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌లో బలీయంగా ఉన్నా.. ఇంగ్లండ్‌లో ఈసారి యాషెస్‌ సిరీస్‌ జరగడంతో ఆ జట్టుకు కలిసి రానుంది.
షెడ్యూల్‌
జూన్‌ 16-20 : తొలిటెస్ట్‌(బర్మింగ్‌హామ్‌)
జూన్‌ 28-జులై 2 : రెండోటెస్ట్‌(లండన్‌, లార్డ్‌)
జులై 6-10 : మూడోటెస్ట్‌(లీడ్స్‌)
జులై 19-23 : నాల్గోటెస్ట్‌(మాంచెస్టర్‌)
జులై 27-31 : ఐదోటెస్ట్‌(లండన్‌, ఓవల్‌)