పెనుకొండ (శ్రీసత్యసాయి) : తమ పాప కనిపించకుండాపోయి 12 రోజులవుతున్నా ... ఇంతవరకు దొరకలేదని ఆ పాప తల్లిదండ్రులు పెనుకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి మంగళవారం నిరసన చేపట్టారు. శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండలో దర్గా పేటకు చెందిన చిన్నారి సఫిహ గత నెల 23వ తేదీకి ముందు కనిపించకుండాపోయిందని, ఆ పాప ఆచూకి ఇంత వరకు దొరకలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై చేపట్టిన ఈ నిరసనతో ట్రాఫిక్ స్తంభించింది.










