Apr 09,2023 13:00

ఢిల్లీ : ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌, ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇండియన్‌ ప్రీమియర లీగ్‌లో అరుదైన రికార్డు సాధిచాడు. శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం సాధించడంతో ఐపీఎల్‌ చరిత్రలో 6 వేల పరుగులు పూర్తి చేసిన తొలి విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌ అత్యధిక పరుగుల చేసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ (225 మ్యాచ్‌ల్లో 6727 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత శిఖర్‌ ధవన్‌ (208 మ్యాచ్‌ల్లో 6370 పరుగులు), వార్నర్‌ (165 మ్యాచ్‌ల్లో 6004 పరుగులు), రోహిత్‌ శర్మ (228 మ్యాచ్‌ల్లో 5880 పరుగులు), రైనా (205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు) వరుసగా టాప్‌ ఫైవ్‌లో ఉన్నారు.