న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వివో గురువారం భారత మార్కెట్లోకి వివో వై సీరిస్‌లో కొత్తగా వై27ను విడుదల చేసింది. 6జిబి రామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధరను రూ.14,999గా నిర్ణయించింది. ర్యామ్‌ను మరో 6జిబి విస్తరించుకునే సదుపాయాన్ని కల్పించింది. వివో వై27 ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరాను కలిగి ఉంది. 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ, 50మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ బోకెV్‌ా కెమెరాతోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చింది.










