జలంధర్: వెటరన్ టేబుల్ టెన్నిస్(టిటి) క్రీడాకారుడు అర్జున్ సింగ్ భగత్(77) గుండెపోటుతో మృతిచెందారు. రాజస్తాన్‌లోని జలంధర్‌లో జరిగే మాస్టర్స్ నేషనల్స్‌లో టిటి ఛాంపియన్‌షిప్ పోటీలను చూసేందుకు వచ్చిన అర్జున్ సింగ్ హోటల్‌లోని ఒక గదిలో ఉండగా.. మరుసటి రోజు మిత్రులు ఎంత పిలిచినా లేకవపోడంతో హోటల్ సిబ్బంది గది తాళం తీసి చూడగా.. అపస్మార స్థితిలో పడి ఉన్నారు. దీంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అర్జున్ సింగ్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. మంగళవారం అర్జున్ సింగ్ స్వస్థలమైన జోథ్‌పూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల జరిగిన 2023 ప్రపంచ వెటరన్ టిటి ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ సింగ్ కాంస్య పతకం సాధించారు. గతంలో జాతీయస్థాయిలో అనేక టోర్నమెంట్‌లలో అనేక పతకాలు గెలిచిన అర్జున్.. నేషనల్ వెటరన్స్ ఛాంపియన్‌షిప్‌లో రెగ్యులర్ ఆటగానిగా కొనసాగుతున్నారు. గత ఏడాది శ్రీనగర్‌లో జరిగిన సీనియర్ నేషనల్స్ పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం నెగ్గారు. ఆయన మృతికి టిటిఎఫ్‌ఐ అధ్యక్షురాలు మేఘనా అహ్లావత్ ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.










