ప్రముఖ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్. స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటుతోన్నాడు. మలేషియా వేదికగా జరిగిన ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఏకంగా ఐదు బంగారు పతకాలు సాధించాడు. మాధవన్ కుమారుడు సాధించిన ఘనతను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయాడు. ''దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో వేదాంత్ భారత్‌కు ఐదు బంగారు పతకాలు(50 మీటర్లు, 100, 200, 400, 1500 విభాగాల్లో) సాధించాడు'' అంటూ మాధవన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో.. వేదాంత్ మాధవన్‌కు అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
With Gods grace and all your wishes Vedaant gets 5 golds for India ( 50, 100,200,400 & 1500m) with 2 PB’s at the Malaysian invitational age group championships,2023 held this weekend in Kuala Lumpur. Elated and very grateful. 🙏🙏🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️Thank you @swimmingfedera1 @Media_SAI pic.twitter.com/vaDMmiTFnh
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 16, 2023
వేదాంత్ మాధవన్ గతంలోనూ పలు స్విమ్మింగ్ టోర్నమెంట్లలో తన సత్తా చాటుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీం మహారాష్ట్ర తరపున ఖేలో ఇండియా 2023లో పాల్గొన్న వేదాంత్ ఐదు బంగారం, రెండు వెండి పతకాలను గెలుచుకున్నాడు. గతేడాది జరిగిన 48వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో మాధవన్ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు.










