Mar 25,2023 15:16

హైదరాబాద్‌ : ఈ నెల 31న మొదలయ్యే మెగా టోర్నీలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని ఆశిస్తోంది. ఈ సారి సన్‌ రైజర్స్‌ను దక్షిణాఫ్రికా స్టార్‌ ఐడెన్‌ మార్‌ క్రమ్‌ నడిపించనున్నాడు. కాగా ఐపీఎల్‌ 2023 కోసం సన్‌ రైజర్స్‌ ట్రెయినింగ్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసింది. ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకోగా.. వారం నుంచి ఉప్పల్‌ స్టేడియంలో ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హారీ బ్రూక్‌, అభిషేక్‌ శర్మతో పాటు పలువురు నూతన ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగమయ్యారు. కోచ్‌లు లారా, ముత్తయ్య మురళీ ధరణ్‌, డేల్‌ స్టెయిన్‌ సమక్షంలో డే టైమ్‌తో పాటు రాత్రి ఫ్లడ్‌ లైట్ల వెలుతురులోనూ ట్రెయినింగ్‌ సెషన్స్‌ జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 2వ తేదీన ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ సీజన్‌ను ఆరంభించనుంది.