గన్నవరం: ఖమ్మంలో బిజెపి బహిరంగ సభ నేపథ్యంలో.. కేంద్ర హౌంమంత్రి అమిత్ షా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అమిత్ షాకు ఏపీ హౌంమంత్రి తానేటి వనిత, అధికారులు, బిజెపి నేతలు స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో ఆయన ఖమ్మంకు బయలుదేరి వెళ్లారు.తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకొస్తున్న భారతీయ జనతా పార్టీ ఇందుకు అనుగుణంగా సత్తా చాటేలా ఖమ్మం గడ్డ నుంచి శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు సర్వసన్నద్ధమైంది.ఈ క్రమంలో ఖమ్మంలో 'రైతు గోస- బిజెపి భరోసా' పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కాసేపట్లో కేంద్ర హౌంమంత్రి అమిత్ షా ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.










