బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 174ఆలౌట్
రంజీట్రోఫీ ఫైనల్
కోల్‌కతా: సౌరాష్ట్ర కెప్టెన్, పేసర్ జయదేవ్ ఉనాద్కట్ మెరుపు బౌలింగ్‌కు తోడు.. యువ పేసర్ చేతన్ సకారియా బౌలింగ్‌లో చెలరేగడంతో బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 174పరుగులకే కుప్పకూలింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన రంజీట్రోఫీ ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జట్టుకు శుభారంభం దక్కలేదు. బెంగాల్ ఓపెనర్లు సమంత గుప్తా(1), అభిమన్యు ఈశ్వరన్(0)కి తోడు గరామీ(0) నిరాశపరచడంతో బెంగాల్ జట్టు 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సౌరాష్ట్ర యువ బౌలర్ చేతన్ సకారియా మరో ఎండ్‌లో చెలరేగడంతో బెంగాల్ జట్టు 66పరుగులకే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో షాబాద్(69), అభిషేక్ పోరెల్(50) కలిసి 7వ వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆదుకున్నారు. వీరిద్దరి నిష్క్రమణ అనంతరం లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో బెంగాల్ జట్టు తొలిఇన్నింగ్స్ 174పరుగుల వద్ద ముగిసింది. ఉనాద్కట్, సకారియాకు మూడేసి, ధర్మేంద్ర, చిరాగ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 81పరుగులు చేసింది. ఓపెనర్ హర్విక్ దేశారు(38), చేతన్ సకారియా(2) క్రీజ్‌లో ఉన్నారు.
స్కోర్‌బోర్డు..
బెంగాల్ తొలి ఇన్నింగ్స్: సుమంత గుప్తా (సి)జాక్సన్ (బి)సకారియా 1, అభిమన్యు ఈశ్వరన్ (సి)గోహిల్ (బి)ఉనాద్కట్ 0, సుదీప్ గరామీ (బి)సకారియీ 0, మజుందార్ (సి)దేశారు (బి)చిరాగ్ జానీ 16, మనోజ్ తివారి (సి)విశ్వరాజ్ (బి)ఉనాద్కట్ 7, ఆకాశ్ ఘాటక్ (సి)ఉనాద్కట్ (బి)సకారియా 17, షాబాద్ అహ్మద్ (సి)విశ్వరాజ్ (బి)ధర్మేంద్ర 69, అభిషేక్ పోరెల్ (సి)మన్కడ్ (బి)చిరాగ్ జానీ 50, ఆకాశ్ దీప్ (సి)ఉనాద్కట్ (బి)ధర్మేంద్ర 4, ముఖేశ్ కుమార్ (సి అండ్ బి)ఉనాద్కట్ 1, ఇషాన్ పోరెల్ (నాటౌట్) 0, అదనం 9. (54.1 ఓవర్లలో ఆలౌట్) 174పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/2, 3/2, 4/17, 5/34, 6/65, 7/166, 8/172, 9/174, 10/174
బౌలింగ్: ఉనాద్కట్ 13.1-3-44-3, సకారియా 13-4-33-3, చిరాగ్ జానీ 11-2-33-2, మన్కడ్ 11-4-38-0, ధర్మేంద్ర 6-1-19-2
సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: హర్విక్ దేశారు(బ్యాటింగ్) 38, జే గోహిల్ (బి)ఆకాశ్ దీప్ 6, విశ్వరాజ్ జడేజా (సి)అభిషేక్ (బి)ముకేశ్ 25, చేతన్ సకారియా (బ్యాటింగ్) 2, అదనం 10. (17ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 81పరుగులు.
వికెట్ల పతనం: 1/38, 2/73
బౌలింగ్: ముఖేశ్ కుమార్ 6-1-23-1, ఆకాశ్ దీప్ 8-1-28-1, ఘాటక్ 1-0-10-0, ఇషాన్ 1-0-12-0, షాబాజ్ 1-0-2-0










