ఉగాండా దేశంలో ప్రపంచ దివ్యంగుల బ్యాడ్మింటన్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఎచెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం సంతవురిటి గ్రామానికి చెందిన పడాల రూపవతి సంకల్పం చెదారనీయకుండా సింగిల్స్, డబల్స్ & మిక్సడ్ డబల్స్ మూడు విభాగల్లో తన సత్తా చాటింది. మూడు సిల్వర్ మెడల్స్ సాధించి భారతదేశ కీర్తిని ఎగురవేసింది. అంతే కాకుండా ఎంతోమంది యువతకి ఆదర్శంగా నిలిచింది. అన్ని విభాగాలలో భారత్ మొత్తం 42 పతకాలు గెలుచుకుంది. వీటిలో బంగారం 13, కాంస్యం 12, రజతం 17 ఉన్నాయి. వీరి ప్రతిభకు దేశ ప్రజల నుండి అభినందనలు తెలుపుతున్నారు.










