Apr 08,2023 22:02

న్యూఢిల్లీ: ఆసియా క్రీడలతోపాటు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే హాకీ మహిళలజట్టును హాకీ ఇండియా(హెచ్‌ఐ) శనివారం ప్రకటించింది. హెచ్‌ఐ ప్రకటించిన 33మంది క్రీడాకారిణుల జట్టుకు గోల్‌కీపర్‌ సవిత కుమారి కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వీరందరికీ బెంగళూరులోని ఏప్రిల్‌ 9 నుంచి మే 13వరకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సన్నాహక శిబిరంలో నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ శిబిరానికి స్టార్‌ మహిళా క్రీడాకారిణులు నవ్‌నీత్‌ కౌర్‌, డీన్‌ గ్రేస్‌ ఎక్కా, గుర్జీత్‌ కౌర్‌, సలీమా కూడా హాజరుకానున్నట్లు తెలిపింది.
గోల్‌కీపర్స్‌: సవిత, రజని, బి.దేవి, బన్సారీ.
డిఫెండర్లు: గ్రేస్‌ ఎక్కా, గుర్జీత్‌ కౌర్‌, నిక్సీ ప్రధాన్‌, ఉదిత, ఇషికా చౌదరి, అక్షిత, జ్యోతి ఛత్రి, మహిమ చౌదరి.
మిడ్‌ఫీలర్లు: నిషా, సలీమా, సుశీలా, జ్యోతి, నవ్‌జీత్‌ కౌర్‌, మరీనా, సోనికా, నేహా, బల్జీత్‌ కౌర్‌, రీనా ఖోకర్‌, వైష్ణవి, అజ్మినా,
ఫార్వర్సు: లాల్‌రెమిసెమి, నవ్‌నీత్‌ కౌర్‌, వందనా కటారియా, షర్మిలా దేవి, దీపిక, సంగీత కుమారి, ముంతాజ్‌ ఖాన్‌, సునేలితా.