Sep 01,2022 10:59

ప్రజాశక్తి - రాప్తాడు : అనంతపురం జిల్లాలోని రాప్తాడు సమీపంలో పండ మీరు వంకలో వినాయక నిమజ్జనానికి వచ్చిన నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని పోలీసులు కాపాడారు. గల్లంతయిన వారిలో శ్రీ రాములు (45)  మృతదేహం లభ్యం అయింది. జయశ్రీ కోసం పోలీసులు రెస్క్యూ టీం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ మురళీధర్‌ రెడ్డి, ఎస్‌ఐ రాఘవరెడ్డి మాట్లాడుతూ.. అధికారులు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే వినాయకుని నిమజ్జనం చేయాలన్నారు. నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లలను నిమజ్జనానికి తీసుకురకూడదని తెలిపారు.