Jan 07,2023 20:38

న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు ఇండియా తన కొత్త 2023 బిఎండబ్ల్యు 740ఐ ఎం స్పోర్ట్‌, బిఎండబ్ల్యు ఐ7 వేరియంట్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. శనివారం ఆవిష్కరించిన బిఎండబ్ల్యు ఐ7 విద్యుత్‌ కారు ఎక్స్‌షోరూం ధరను రూ.1.95 కోట్లుగా నిర్ణయించింది. దీనికి బుకింగ్స్‌ను తెరిచినట్లు వెల్లడించింది. మార్చి నుంచి డెలివరీలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. చెన్నరు ప్లాంట్‌లో దీన్ని తయారు చేసినట్లు తెలిపింది. ఒక్క సారి ఛార్జింగ్‌ చేస్తే 625 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని పేర్కొంది. ఇందులో రెండు విద్యుత్‌ మోటర్లను అమర్చింది. బిఎండబ్ల్యు740 ఐ ఎం స్పోర్ట్‌ వేరియంట్‌ను పెట్రోల్‌ వర్షన్‌లో ఆవిష్కరించగా.. దీని ధరను రూ.1.70 లక్షలుగా ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని డీజిల్‌ వేరియంట్‌లోనూ తీసుకురానున్నట్లు పేర్కొంది.