Nov 11,2023 07:52

యుద్ధం ఇప్పుడు జీవన్మరణ సమస్య కాదు
యుద్ధం ఇప్పుడు అనివార్య అవసరం
యుద్ధం ఇప్పుడు ఒక నానార్థం
యుద్ధం ఇప్పుడు ఒక దురాక్రమణ
యుద్ధం ఇప్పుడు ఒక ఆధిపత్య పోరు
యుద్ధం ఇప్పుడు ఒక ఆయుధ వ్యాపారం
యుద్ధం ఇప్పుడు ఒక వనరుల దోపిడీ
యుద్ధం మంటలు రేగిన మరు భూమి
యుద్ధం సామూహిక ఖననాల వేదిక.
రక్తసిక్త రణరంగమందు
ఉన్మత్తుల మారణ హోమం
ఉగ్రరూప ఉపద్రవం.
అగ్రదేశాల ఆగ్రహ అనల వేదిక యందు
అబలలు, అమాయకులు సమిధలు
పొత్తిళ్ల పసిపాపలు అమర ప్రమిదలు.
సహనం సామరస్యం సహించరాని నేరాలు
సత్యం ప్రసార మాధ్యమాల అంగడి సరుకు
సహజీవనం, శాంతి చెల్లని కానీలు
అవును యుద్ధం అనివార్య అవసరం!
(ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై దాడికి నిరసనగా)
- డా.ఎడ్ల కల్లేశ్‌
సెల్‌ : 9866765126