Feb 18,2023 22:01

కోల్‌కతా: రంజీట్రోఫీ ఫైనల్లో బెంగాల్‌ జట్టు పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 230పరుగులు వెనుకబడ్డ బెంగాల్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో శనివారం ఆట నిలిచే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 169పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర జట్టు 404 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ జాక్సన్‌(59), వసవాడ(81), చిరాగ్‌ జానీ(60) అర్ధసెంచరీలతో మెరిసారు. సౌరాష్ట్ర జట్టు 11వ వికెట్‌కు 35పరుగులు జతచేయడం విశేషం. బెంగాల్‌ బౌలర్లు ముఖేశ్‌ కుమార్‌కు నాలుగు, ఆకాశ్‌ దీప్‌, ఇషాన్‌ పోరెల్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బెంగాల్‌ను కెప్టెన్‌ మనోజ్‌ తివారీ(57నాటౌట్‌), మజుందార్‌(61) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. మూడోరోజు ఆట నిలిచే సమయానికి తివారీకి తోడు షాబాజ్‌ అహ్మద్‌(13) క్రీజ్‌లో ఉన్నాడు. బెంగాల్‌ జట్టు ఇంకా 61పరుగులు వెనుకబడి ఉంది.