లార్డ్: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని లార్డ్ వేదికగా బుధవారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్య ఓటమితో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. గాయపడ్డ మొయిన్ అలీ స్థానంలో రేహాన్‌కు చోటు కల్పించినట్లు ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్‌బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలిటెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు 2వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచింది.










