ఆసియాకప్ జూనియర్ హాకీ
బెంగళూరు: ఈనెల 23నుంచి ఓమన్ వేదికగా జరగనున్న ఆసియా జూనియర్ హాకీ టోర్నీలో పాల్గనే భారత జట్టుకు ఫార్వర్డ్ ఆటగాడు ఉత్తమ్‌సింగ్ సారథ్యం వహించనున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కరమ్‌పూర్ గ్రామానికి చెందిన ఉత్తమ్ సింగ్ గత ఏడాది నవంబర్‌లో సుల్తాన్ జహర్‌కప్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 5-4గోల్స్ తేడాతో గెలుపుకు దోహదపడ్డాడు. గత ఏడాది సుల్తాన్ జహర్‌కప్‌లో ఆడిన ఉత్తమ్‌సింగ్‌కు మళ్లీ పగ్గాలు అప్పగిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. సుల్తాన్ జహర్‌కప్‌లో సడన్‌డెత్‌లో భాగంగా రెండుసార్లు షూటౌట్‌లోనూ గోల్స్ కొట్టాడు. ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టు ఎఫ్‌ఐహెచ్ జూనియర్ పురుషుల ప్రపంచకప్‌కు అర్హత సాధించనుంది. ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ ప్రపంచకప్ డిసెంబర్‌లో మలేషియా వేదికగా జరగనుంది. ఇక గ్రూప్‌ాఏలో భారత్‌తోపాటు పాకిస్తాన్, జపాన్, థారులాండ్, చైనీస్ తైపీ ఉండగా.. గ్రూప్‌ాబిలో కొరియా, మలేషియా, ఒమన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ జట్లు ఉన్నాయి.
గోల్‌కీపర్లు: మోహిత్, హిమ్‌వాన్ సిహాగ్
డిఫెండర్లు: శ్రద్ధానంద్ తివారి, రోహిత్, అమన్‌దీప్ సింగ్ లక్రా, అమీర్ అలీ, యోగేంబర్ రావత్
మిడ్‌ఫీల్డర్లు: విష్ణుకాంత్ సింగ్, రాజిందర్ సింగ్, పూవన్న, అమన్‌దీప్, సునిత్ లక్రా
ఫార్వర్డ్స్: బాబీసింగ్(వైస్ కెప్టెన్), అరజిత్ సింగ్, ఆదిత్య లలాగే, ఉత్తమ్‌సింగ్(కెప్టెన్), సుదీప్ ఛిమాకో, అంగద్‌బీర్ సింగ్.










