Sep 03,2023 11:57

కడప జిల్లా : జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలంలోని గుండ్లకుంట గ్రామాన్ని వరద ముంచెత్తింది. నిన్న రాత్రి 16 సెంటీమీటర్ల మేర వర్షం కురవడంతో, భారీ వర్షం ధాటికి ఆదివారం గుండ్లకుంట గ్రామమంతా జలమయమయ్యింది. గ్రామంలో మోకాళ్ళలోతు వరద నీరు ప్రవహిస్తుంది. వరదనీటితో గ్రామస్తులు ఇబ్బందిపడుతున్నారు.