Jul 15,2023 10:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిగ్రీ ప్రవేశాల గడువును మరోసారి ఉన్నత విద్యామండలి పొడిగించింది. డిగ్రీ ఫీజులను ఖరారు చేయడంలో ఆలస్యం కావడంతో రెండుసార్లు ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఎట్టకేలకు ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 12న విడుదల చేసిన జిఒపై ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఈ నెల 12వ తేదితో ముగిసిన రిజిస్ట్రేషన్‌ గడువును 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.